
కొరియోగ్రాఫర్ మరియు నటుడు లారెన్స్ హీరోగా ప్రస్తుతం చంద్రముఖి-2 చేస్తున్న సంగతి తెలిసిందే. పి.వాసు ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజు గెటప్‌లో లారెన్స్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవ్లలో వినాయక చివితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కంగానా రనౌత్ కీలక పాత్రలో నటించగా.. రాధికా శరత్‌కుమర్, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. నిజానికి చంద్రముఖి విజయం తర్వాత రజినీతోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని దర్శకుడు p.వాసు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు.













