ఆది ‘బుర్రకథ’ వాయిదా?

యువ నటుడు ఆది సాయికుమార్‌, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈసినిమాతో ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ శుక్రవారం విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే సెన్సార్‌ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో సినిమా విడుదల వాయిదా పడింది.

ఆఖరి నిమిషంలో టెన్షన్‌ ఉండకూడదన్న ఉద్దేశంతో సినిమాను ఒక రోజు ఆలస్యంగా శనివారం విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే శుక్రవారానికి కూడా సెన్సార్‌ విషయంలో క్లారిటీ వచ్చే అవకావం లేకపోవటంతో ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. కొత్త రిలీజ్‌ డేట్‌ త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో ఆది సాయికుమార్‌ తో.. దర్శకుడు డైమండ్‌ రత్నబాబు తొలి సినిమా కావటంతో ఈ ఇద్దరి కెరీర్‌లకు ఈ సినిమా కీలకంగా మారింది.