
Liquor Bottle Rate in Telangana:
తెలంగాణలో మద్యం ప్రియులకు ఒక్కసారిగా షాకింగ్ న్యూస్. ఇప్పటికే బీర్ ధరలు పెరిగాయని అసలు తేరుకోకముందే… ఇప్పుడు మద్యం బాటిళ్ల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఎక్సైజ్ శాఖ మద్యం షాప్ ఓనర్లకు ఒక సర్క్యులర్ పంపింది. దీని ప్రకారం, క్వార్టర్ బాటిల్ ధర రూ.10 పెరుగుతుంది, హాఫ్ బాటిల్ ధర రూ.20, ఫుల్ బాటిల్ ధర అయితే రూ.40 పెరగనుంది.
ఈ పెంపుతో ప్రభుత్వం దాదాపు రూ.2000 కోట్ల అదనపు ఆదాయం పొందే ఛాన్స్ ఉంది. జూన్ 30తో ప్రస్తుత మద్యం షాపుల ఒప్పందం ముగియనుండగా, జూలై 1 నుండి కొత్త ఒప్పందాలతో మద్యం కంపెనీలతో, డిస్టిల్లరీస్‌తో ప్రభుత్వం ముందుకు వెళ్లబోతోంది.
ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణలో తక్కువ ధరల మద్యం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఖరీదైనదే. ఇప్పుడు మళ్లీ ధరలు పెరిగితే… నకిలీ మద్యం, స్మగ్లింగ్ వంటివి పెరిగే ప్రమాదం ఉందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అందుకే తక్కువ ధరల మద్యం ధరలను మాత్రం పెంచకూడదని సలహా ఇచ్చింది.
ఇంకా కర్నాటకలో లాగా టెట్రా ప్యాక్ లిక్కర్‌ను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. దీని వల్ల రూ.15 నుండి రూ.20 వరకే పెరుగుదల ఉండొచ్చు అని అంచనా.
అసలు మొదట్లో ధరలు పెంచాలన్న ఆలోచన లేకపోయినా… ఒక ప్రముఖ MNC కంపెనీ 60% వాటాతో ప్రాథమిక ధరను 30.1% పెంచాలంటూ డిమాండ్ చేయడంతో… మిగిలిన కంపెనీలు కూడా అదే దారిలో నడవడం వల్ల ప్రభుత్వం 15-19% ధర పెంపునకు సిద్దమైంది.
అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం ఎక్సైజ్ శాఖ విడుదల చేయలేదు. కానీ మద్యం వినియోగదారులలో మాత్రం అసంతృప్తి భారీగా పెరిగింది.
ALSO READ: ఒకే ఒక్క సన్నివేశం కోసం Thalapathy Vijay ఇంత పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారా?