యువగళం రాంగ్ ట్రాక్‌లో పోతోంది అట. నిజంగా అలా పోతే మీకు మంచిదే కదా. మరెందుకు వైసీపీ మీడియా తెగ ఇదైపోతుంది ?, పైగా నారా లోకేశ్ పాదయాత్ర పై నెగిటివ్ ప్రచారం చేస్తోంది. ఈ డిజిటల్ జనరేషన్ లో ఇలాంటి ప్రచారాల వల్ల ఉపయోగం లేదని కూలీ మీడియా ఎందుకు అర్థం చేసుకోలేక పోతుంది ?. ఇంతకీ వైసీపీ మీడియా చేస్తున్న నెగిటివ్ ప్రచారం ఏమిటో తెలుసా ?, ‘పాదయాత్రలో నారా లోకేశ్ మాట తీరే ఆయనకు శత్రువుగా పరిణమిస్తోందట. పాదయాత్రలో ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా సాగుతోందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందట. లోకేశ్ తన అసహనాన్ని, పైత్యాన్ని ప్రజలపై ప్రదర్శించడానికి పాదయాత్రను ఉపయోగించుకుంటున్నారట’ ఇలా లోకేశ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంటూ నీలి మీడియా తప్పులను ఒప్పులుగా ప్రచారం చేస్తోంది.
నిజం మాట్లాడుకుంటే.. లోకేశ్ పాదయాత్ర సూపర్ హిట్ కాదు, కాకపోయినా ప్రజలు సూపర్ హిట్ అనుకుంటున్నారు. దీనిబట్టి టీడీపీ పట్ల ప్రజలు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో.. లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అయ్యిందన్న వాదనే ఇక అనవసరం. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం. అందుకే, ఎవరు ఏమి చెబుతున్నారో కూడా ప్రజలు ఆలోచించడం లేదు. అసలు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో లోకేశ్ చెబుతున్నా ప్రజలు వినడం లేదు. మాకు అర్జెంట్ గా ఈ దుష్ట పాలన పోవాలి అంటున్నారు. ఇక జగన్‌ను అది చేస్తాం, ఇది చేస్తామని లోకేశ్ హెచ్చరింస్తుంటే.. ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. జగన్ రెడ్డి పట్ల, ఆయన గారి బటన్ల పట్ల ప్రజలు విసిగిపోయారు. అర్ధరూపాయి ఇచ్చి జగన్ రెడ్డి రెండు రూపాయలు వసూళ్లు చేస్తున్నాడని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే.. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా లోకేశ్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంకా సక్సెస్ కావాలంటే.. జగన్‌కు వార్నింగ్ ఇస్తే చాలు. ప్రజలు తెగ సంతోషపడిపోతున్నారు. మొత్తానికి ‘జగన్‌రెడ్డికి అసలైన భయాన్ని పరిచయం చేసే బాధ్యత లోకేశ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోకేశ్ మాస్ వార్నింగ్ లు ఇస్తున్నాడు. జగన్ రెడ్డి 2024 తర్వాత ఇంట్లో నుంచి బయటికి అడుగు ఎలా పెడతాడో చూస్తా’ అని లోకేశ్ వార్నింగ్ ఇవ్వడం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది.
నిజానికి రాజకీయ ప్రత్యర్థులు కావడంతో ఇలాంటి మాటలు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే నచ్చాలి. కానీ సామాన్య ప్రజానీకానికి కూడా ఎందుకు నచ్చుతున్నాయి ?, జగన్ రెడ్డిని తిడితే ఆనంద పడాల్సిన అవసరం వారికీ ఏమిటి ?, దీనిబట్టి జగన్ రెడ్డి పట్ల సామాన్య జనం కూడా కసిగా ఉన్నారు. కేవలం జగన్‌ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా చేసేందుకు టీడీపీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు అంటే.. జగన్ రెడ్డి సీఎంగా ఎంత దారుణంగా విఫలం అయ్యాడో ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల ఆశయం, ఆకాంక్ష ఒక్కటే. జగన్ రెడ్డిని ఈ సారి దారుణంగా ఓడిపోవాలి. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, కార్మికులు ఇలా అన్నీ వర్గాలు బలంగా కోరుకుంటున్న ఏకైక కోరిక ఇదే. ఫలానా మంచి పని చేస్తాను అనే భరోసా జగన్ రెడ్డి ఇచ్చినా ప్రజలు నమ్మడం లేదు అంటే.. ఏమనుకోవాలి. అయినా ఎంతసేపూ రాజకీయ కక్షలు, కార్పణ్యాలు తప్ప, జగన్ రెడ్డికి మరొకటి లేదు కదా. ఇది ప్రజల నుంచి వస్తున్న మాట. మొత్తానికి జగన్ రెడ్డి అధికారానికి కాలం చెల్లినట్టే.