మా పోరాటం వ్యక్తిగతంగా కాదు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా అంశంపై అనంతపురం లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయడం ఖాయమని చెప్పారు.

ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వంచన చేసిన నేతలకు వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారని వెల్లడించారు.

రాష్ట్ర సమస్యలపై పోరాడేందుకు ఇకపై ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతామని.. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీలో నిల్చోవడం ఖాయమని స్పష్టం చేశారు. తమ పోరాటం విధానాల మీదనే కానీ వ్యక్తిగతంగా ఎవరిపైనా తమకు శతృత్వం లేదని అన్నారు. అంతేకాదు ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ ప్రాంతంలో కరువు సంస్య తన పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here