HomeTelugu Newsసైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన మాధవీలత

సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన మాధవీలత

Madhavi latha files case on
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సోషల్ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాలపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. మాధవీ లత మాట్లాడుతూ.. మొదటి నుండి నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దేవాలయాల అంశం గురించి మాట్లాడటంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ఎక్కడ అమ్మాయిలు పట్టుబడితే .. అందులో నేను పట్టుబడినట్లు ప్రసారం చేస్తున్నారు. దీంతో ఓ వర్గం నన్ను టార్గెట్ చేసి అసభ్యకరంగా సోషియల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు
తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాను. పోలీసులు వారిని పట్టుకోకపోతే మౌనదీక్షకు దిగుతాను’ అంటూ మాధవీ లత తెలిపారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్నామని.. ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం అని మాధవీ లత పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!