HomeTelugu Big Storiesహీరో ధనుష్‌పై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహాం

హీరో ధనుష్‌పై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహాం

Madras high court denies dh

కోలీవుడ్‌ హీరో ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యాడు. లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ‘సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు ఇబ్బంది ఏమిటి’ అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా చట్టం ముందు అందరూ సమానులేనని ఉద్ఘాటించింది. 2015లో ధనుష్‌ అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దానిని దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన అదే ఏడాదిలో మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా ధనుష్‌ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారు? అని ధనుష్‌ని నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తానని ఆయన సమాధానమిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!