కత్తి రీమేక్ మొదట మహేష్ కు వెళ్లిందట!

మహేష్ బాబు రీమేక్ సినిమాలకు చాలా దూరం. అలాంటిది ఆయన ఒక సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడు. అదే మురుగదాస్ డైరెక్ట్ చేసిన ‘కత్తి’ సినిమా. ఈ సినిమానే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ముందుగా మహేష్ దగ్గరకు వెళ్లిందట. నిజానికి మహేష్ రీమేక్ సినిమాలపై ఆసక్తి లేకపోయినా.. కత్తి సినిమా మాత్రం
చేయాలనుకున్నాడట.

అయితే అది దర్శకుడి సినిమా కాబట్టి మురుగదాస్ డైరెక్ట్ చేస్తేనే సినిమా చేస్తానని చెప్పాడట. ఆ సమయంలో మురుగదాస్ హిందీలో బిజీగా ఉండడం వలన ఆ సినిమా చేయడం కుదరలేదని ఇటీవల మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ‘స్పైడర్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.