HomeTelugu Big Storiesగౌతమ్‌కి మహేష్‌, నమ్రత బర్త్‌డే విషెస్‌

గౌతమ్‌కి మహేష్‌, నమ్రత బర్త్‌డే విషెస్‌

Mahesh babu and Namrata Emటాలీవుడ్‌ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా మహేష్‌ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. నేడు గౌతమ్ కు 14వ పుట్టిన రోజు సందర్బంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. మహేష్ బాబు కూడా కొడుకు గౌతమ్ కు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ.. హ్యాపీ 14 మై సన్. నీ ఎదుగుదుల చూస్తుంటే గర్వంగా ఉంది. ఎప్పటికి సంతోషంగా ఉండాలి లవ్ యూ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు తన ఒడిలో ఉన్న గౌతమ్ ఫొటోను మరియు ఇప్పుడు ఎదిగిన తర్వాత ఫొటోను రెండింటిని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అర్థరాతి సరిగ్గా 12 గంటల సమయంలో మహేష్ బాబు ఈ ట్వీట్ చేశాడు. 50 వేల లైక్స్ మరియు 15 వేల కామెంట్స్ తో అభిమానులు ఈ ట్వీట్ ను వైరల్ చేశారు.

న‌మ్ర‌త శిరోద్క‌ర్ కూడా త‌న‌యుడికి సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు విషెస్ తెలిపారు. “వీడు ఈ ప్ర‌పంచంలోకి రావ‌డం మా జీవితాల‌నే మార్చేసింది. తొలిసారిగా మేము త‌ల్లిదండ్రులమ‌య్యామ‌న్న అనుభూతినివ్వ‌డ‌మే కాక సంతోషాల‌ను, అంత‌కు మించిన ప్రేమ‌ను తీసుకొచ్చాడు. ఇప్పుడు అత‌నికి 14 ఏళ్లు. ప్ర‌తి సంవ‌త్స‌రం అత‌డు మాకు ప్రేమ‌ను, ఆనందాన్ని పంచుతూనే ఉన్నాడు. త‌ల్లిదండ్రులుగా మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నాడు. హ్యాపీ బ‌ర్త్‌డే మై డార్లింగ్ స‌న్‌, ఐ ల‌వ్ యూ సో మ‌చ్” అని ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!