HomeTelugu Trendingఅడవి శేష్‌ 'మేజర్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

అడవి శేష్‌ ‘మేజర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Mahesh Babu announced Majo
టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడవి శేష్ నటిస్తున్న చిత్రం ‘మేజర్’. 26-11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా డైరెక్షణ్‌లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సమర్పణలో సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ‘మేజర్’ రిలీజ్ డేట్ ప్రకటించారు.

మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ‘మేజర్’ చిత్రాన్ని ‘జూలై 2’వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉన్ని కృష్ణన్ గెటప్ లో ఉన్న శేష్ కి సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu