HomeTelugu Trendingగుణ శేఖర్‌ 'ప్రతాపరుద్రుడు'గా మహేష్‌!

గుణ శేఖర్‌ ‘ప్రతాపరుద్రుడు’గా మహేష్‌!

Mahesh babu as gunasekhar
దర్శకుడు గుణశేఖర్ భారీ చారిత్రక పౌరాణిక చిత్రాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం శాకుంతలం సినిమాలను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా 50 శాతం పూర్తయింది.

ఈ సినిమా తరువాత ఆయన ‘హిరణ్యకశిప’ సినిమా చేయాలనే నిర్ణయంతోనే ఉన్నారు. అన్నీ సిద్ధంగానే ఉండటం వలన ఆ సినిమా చకచకా పూర్తవుతుందనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ తరువాత ప్రాజెక్టుగా ‘ప్రతాపరుద్రుడు’ ఉండనుంది. లాక్‌డౌన్ సమయంలో ఈ కథపై ఆయన పూర్తిస్థాయి కసరత్తు చేశారట. ఈ కథకి మహేష్‌ బాబు అయితే బాగుంటాడనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలు వచ్చాయి. మరి మహేష్‌బాబు ఈ ప్రాజెక్టును ఒప్పుకుంటాడా? లేదా అనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu