HomeTelugu Trendingయూట్యూబ్‍లో రికార్డు సృష్టిస్తున్న 'సలార్' ట్రైలర్‌

యూట్యూబ్‍లో రికార్డు సృష్టిస్తున్న ‘సలార్’ ట్రైలర్‌

salaar trailer crosses 100
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సలార్’. నిన్న విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఓ రెంజ్‌లో ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్, ఎమోషన్‍తో సలార్ ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ క్రమంలో యూట్యూబ్‍లో వ్యూస్ విషయంలో సలార్ ట్రైలర్ ముఖ్యమైన మార్క్ దాటింది.

ఈ మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 100 మిలియన్ల (10కోట్లు)కు పైగా వ్యూస్ దాటాయి. ఈ వంద మిలియన్ వ్యూస్ మార్కును 24 గంటలు గడవకముందే ట్రైలర్ దక్కించుకుంది. సలార్ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7:19 గంటలకు రాగా.. ఒక రోజు కూడా పూర్తికాక ముందు అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ 100 మిలియన్ మార్కును దాటింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన హొంబాలే ఫిల్మ్స్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

సలార్ ట్రైలర్‌కు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి సలార్ తెలుగు ట్రైలర్‌కు 29 మిలియన్ల వ్యూస్ వస్తే.. హిందీ ట్రైలర్‌కు సుమారు 49 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ జోరు కొనసాగే అవకాశం ఉంది. తమిళం, కన్నడ, మలయాళంలోనూ సలార్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులుగా ఉండనున్నారని ట్రైలర్లో తెలిసిపోయింది. ప్రభాస్ యాక్షన్ సీన్లు ట్రైలర్లో హైలైట్‍గా నిలిచాయి. ప్రభాస్ ఈ చిత్రంలో దేవ పాత్ర చేయగా.. వరదరాజ మన్నార్ క్యారెక్టర్ చేశారు పృథ్వీరాజ్. ఖాన్సార్ సిటీ కోసం కొన్ని గ్రూప్‍ల మధ్య జరిగే పోరాటాలే ఈ చిత్రం ప్రధాన కథగా ఉంది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‍గా నటించగా.. ట్రైలర్‌లో ఒకచోట మాత్రమే ఆమె కనిపించారు. జగపతి బాబు, బాబి సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి ఆనంద్, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.

Image

 

 

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu