HomeTelugu Trendingసైరా రికార్డును మహేష్ మూవీ బ్రేక్ చేసిందా..!

సైరా రికార్డును మహేష్ మూవీ బ్రేక్ చేసిందా..!

12 8
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి” చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ వసూళ్లలోనూ సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, సైరా సినిమా రికార్డులను మహేష్‌ బాబు సినిమా “సరిలేరు నీకెవ్వరు” బీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి “సైరా” సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్నీ కలిపి రూ. 9 కోట్లు పలకగా.. మహేష్ “సరిలేరు నీకెవ్వరు” చిత్రం అంతకంటే రూ.6.25 కోట్లు ఎక్కువ పలికి సైరా రికార్డులను బ్రేక్ చేసినట్లు చెబుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి రూ.15.25 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu