HomeTelugu Trendingనవంబరు 26న 'గుడ్‌ లక్‌ సఖి'

నవంబరు 26న ‘గుడ్‌ లక్‌ సఖి’

 

Good Luck Sakhi Release Dat

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్‌ నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి రైఫిల్‌ షూటర్‌గా నటించింది. నాగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలకావాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడటంతో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది. నవంబరు 26న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. సుధీర్‌ చంద్ర నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఆది, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu