HomeTelugu Trendingగుంటూరు కారంలో త్రివిక్రమ్ మాస్ మసాలా

గుంటూరు కారంలో త్రివిక్రమ్ మాస్ మసాలా

Guntur Karam updateసూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ఒక‌టి. ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లు.

ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో మంచి మాస్‌ మసాలా దట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్‌ ఆడియన్స్‌ను ఊపేసేందుకు ఓ ఐటెం సాంగ్‌ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన దమ్‌ మసాలా బిర్యానీ, ఓ మై బేబీ సాంగ్‌ల‌ు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారంలో స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే చేయ‌నున్నట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ డ‌స్కీ బ్యూటీ డింపుల్ హయాతిని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌కు డింపులే పర్ఫెక్ట్ అని భావించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

డింపుల్ హయాతి గతంలో వ‌రుణ్ తేజ్ హీరోగా వ‌చ్చిన‌ గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ ఐటంసాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ర‌వితేజ‌తో ఖిలాడీ, గోపీచంద్‌తో రామబాణంలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu