మహర్షి న్యూ లుక్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో ఎన్నడూ లేని బియర్డ్‌ లుక్‌లో కనిపించేసరికి సూపర్‌స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి మరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

సూట్‌లో అలా స్టాలీష్‌గా మహేష్‌ నడుస్తూ ఉండగా.. పక్కన ఉన్నవారు గొడుగు పట్టుకుని ఉన్న ఈ లుక్‌ ప్రిన్స్‌ అభిమానులకు కిక్కిచ్చేలా ఉంది. స్టూడెంట్‌గా కాలేజ్‌లో నడుస్తు వచ్చిన టీజర్‌లో మహేష్‌ గడ్డంతో ఉండగా, ఈ లుక్‌లో పవర్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌లా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది కాగా అల్లరి నరేష్‌ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.