
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారేమో అని ఓ క్షణం భ్రమపడ్డారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. వీళ్లు నిజంగానే కలిసి నటిస్తున్నారు.. కానీ సినిమా కోసం కాదు కమర్షియల్ యాడ్. యాడ్ షూటింగ్‌లో ఇద్దరు హీరోలు పాల్గొంటున్న ఫొటో ఆన్‌లైన్‌లో లీక్ అవ్వగా అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా వుంటే రణ్‌వీర్ ప్రస్తుతం ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ’83’లోనూ మెప్పించనున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు.













