‘రైటర్ పద్మభూషణ్’ పై మహేష్‌ బాబు రివ్యూ


సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా.. ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాన్ని వీక్షించిన్నట్లు వెల్లడించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎంతగానో ఆస్వాదించానని తెలిపారు. నిజంగా ఇది హృదయానికి హత్తుకునే సినిమా అని కొనియాడారు. ముఖ్యంగా, ఈ సినిమా క్లైమాక్స్ ఎంతగానో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. తప్పకుండా కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని మహేశ్ బాబు అభివర్ణించారు.

‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంలో సుహాస్ నటనకు అభిమానినయ్యానని తెలిపారు. ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ షణ్ముఖ్ తో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలుపుతున్నట్టు మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలైంది. ఇప్పటికే మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates