మహేశ్‌కు జంటగా జాన్వీ!

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్.. త్రివిక్రమ్ డైరెక్షణ్‌లో ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ కోసం అతిలోకసుందరి తనయను రంగంలోకి దించబోతున్నారట. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలసి 30కి పైగా సినిమాల్లో జోడీ కట్టారు. వాటిలో చాలా వరకు హిట్ చిత్రాలే. ఇప్పుడు వారి వారసులు కలసి సినిమాలో నటిస్తే అది తప్పకుండా సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందనే చెప్పాలి. అందుకే జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని మహేశ్, త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ భావిస్తోంది. గతంలో కూడా జాన్వీని తెలుగులో నటింప చేయాలని పలువురు ప్రయత్నించారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మహేశ్ సినిమాతో ఎంట్రీ ఇస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ భావన. బాలీవుడ్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూనే వస్తోంది. మరి జాన్వీ తెలుగు లాంఛింగ్ అవుతుందా? లేక గుసగుసలకే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates