HomeTelugu NewsRX 100 దర్శకుడు ఓ ఇంటివాడయ్యాడు

RX 100 దర్శకుడు ఓ ఇంటివాడయ్యాడు

RX 100 సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి ఓ ఇంటివాడయ్యారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన వివాహ వేడుక వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిరీష అనే అమ్మాయిని ఆయన మనువాడారు. ఈ శుభకార్యానికి హీరో కార్తికేయ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను కార్తికేయ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘ నా బాస్ అజయ్‌ భూపతికి బాస్‌ వచ్చారు (నవ్వుతున్న ఎమోజీ). శుభాకాంక్షలు సర్‌’ అని ట్వీట్‌ చేశారు.

5 27

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర అజయ్‌ భూపతి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయన తన తొలి సినిమా RX 100తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన ఈ సినిమాను అశోక్‌ రెడ్డి నిర్మించారు. చేతన్‌ భరద్వాజ్‌ బాణీలు అందించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu