తమిళనాడులో ‘స్పైడర్’ జోరు మామూలుగా లేదు!

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం ‘స్పైడర్’. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో కూడా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడులో ఈ సినిమాను దాదాపుగా 450 థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కు ఇది తమిళనాడులో తొలి సినిమా అయినప్పటికీ అక్కడ క్రేజ్ బాగానే ఉంది. అలానే ఓవర్సీస్ లో
ఈ సినిమా 800లకు పైగా స్క్రీన్ లలో ప్రదర్శించబోతున్నారు.

బాహుబలి సినిమా తరువాత ఆ రేంజ్ లో ‘స్పైడర్’ విడుదల కానుండడం విశేషమనే చెప్పాలి. మురుగదాస్ దర్శకత్వంలో
ఈ సినిమా రూపొందడం ‘స్పైడర్’ కు హైప్ రావడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగ రాస్తుందో.. చూడాలి!