ఏఎంబి సినిమాస్‌లో మహేష్ మైనపు బొమ్మ

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క మైనపు బొమ్మను ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తయారుచేసిన సంగతి తెలిసిందే. సింగపూర్లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు దీన్ని రూపొందించారు. త్వరలోనే ఈ బొమ్మను లండన్‌లో ఉన్న మేడం టుస్సాడ్స్ ప్రధాన మ్యూజియంలో ఉంచుతారు. అంతకంటే ముందే దాన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. ఇక్కడే మహేష్ సమక్షంలో ఓపెన్ చేస్తారట. ఈ సందర్బంగా మహేష్ అభిమానుల కోసం మైనపు బొమ్మను ఏఎంబి సినిమాస్ లో ఒకరోజు మొత్తం ఉంచనున్నారు. ఇంకేముంది మహేష్ బాబుతో సెల్ఫీ దిగే అవకాశం దొరకలేదని ఫీలయ్యే అభిమానులంతా ఆయన మైనపు బొమ్మతో సెల్ఫీలు దిగడమే.