మహేష్ కు రెస్ట్ లేదు!

మురుగదాస్ సినిమా కోసం మహేష్ విశ్రాంతి కూడా తీసుకోకుండా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే మహేష్ బాబు, కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. దానికి కోసం మహేష్ విరామం లేకుండా పని చేస్తున్నాడు. ఇటీవలే సినిమా టీం వియత్నాం వెళ్ళి వచ్చింది. అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు.

అక్కడ షెడ్యూల్ పూర్తి కావడంతో చెన్నైకి వెళ్ళి తదుపరి షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు మహేష్. తొందరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కసిగా పని చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఈ నెలలోనే కానున్నట్లు తెలుస్తోంది.