ప్రభాస్ లిస్ట్ లో రెండు సినిమాలు!

గత ఐదేళ్లపాటు బాహుబలి సినిమాకు పరిమితమయిన ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అభిమానులను అలరించనున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. అందులో మొదటిది సాహో సినిమా అనే సంగతి అందరికీ తెలిసిందే అయినా రెండో సినిమా గురించే చాలా మందికి క్లారిటీ లేదు. అయితే, లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం రెండో సినిమా రాధాకృష్ణ డైరెక్షన్‌లో వుండనుందని తెలుస్తోంది.

ఈ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే నిర్మితం కానుంది. సుజీత్ తెరకెక్కించే చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో రూపొందనుండగా రాధాకృష్ణ సినిమా ఓ లవ్ స్టోరీ అని సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన లొకేషన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వీటితో పాటు ఆసక్తి కలిగించే బాలీవుడ్ ప్రాజెక్ట్ ఏమైనా తన దగ్గరకు వస్తే చేస్తానని ఇటీవల ప్రభాస్ అన్నారు.