మహేష్ సినిమా టైటిల్ ఇదేనా..?

ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి
రకరకాల టైటిల్స్ అనుకుంటునప్పటికీ ఏది ఫైనల్ చేయలేదు. అయితే మహేష్ చేయబోయే
తదుపరి సినిమాకు ఇప్పటినుండే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో
తనకు శ్రీమంతుడు వంటి హిట్ సినిమాను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్
బాబు ఓ సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్
అనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి
పాత్రలో కనిపించనున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి పదవులను చేపట్టే సమయంలో అభ్యర్ది
తమ పేరు చెప్పి ప్రమాణస్వీకారం చేస్తారు. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్ ను ఫైనల్ చేసే
అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వీటిపై కొరటాల శివ ఎలా స్పందిస్తాడో చూడాలి!