మహేష్ సినిమాకి ముహూర్తం కుదిరింది!

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 
సినిమా తరువాత మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 9న 
పూజాకార్యక్రమాలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి 
పాత్రలో కనిపించనున్నాడని.. అలానే ఈ సినిమాకు ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను 
పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంగీత 
దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా..?
అనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నాడు. మహేష్, మురుగదాస్ సినిమా షూటింగ్ పూర్తయిన 
వెంటనే మహేష్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. దీని తరువాత ఆయన వంశీ పైడిపల్లి 
దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. మొత్తానికి వరుస ప్రాజెక్ట్స్ తో సూపర్ స్టార్ బిజీగా 
మారిపోయాడు.