HomeTelugu Trendingమహేష్‌ న్యూపిక్‌ వైరల్‌

మహేష్‌ న్యూపిక్‌ వైరల్‌

Mahesh New pics Viral
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మ‌హేష్ బాబు తాజాగా త‌న ఫ్యామిలీతో వెకేష‌న్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్క‌డ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ, ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి అప్‌డేట్స్ ఇస్తూ.. సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు టచ్‌లో ఉంటున్నాడు మహేష్‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా ఎయిర్ పోర్ట్‌లో హూడితో గాగుల్స్ లుక్ పెట్టుకొని దిగిన ఫొటోని షేర్ చేశాడు. ఇందులో మ‌హేష్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది అందంగా పెరుగుతున్నావ్‌, సీక్రెట్ ఏంటో చెప్పండి అంటూ అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా మ‌హేష్ త్వరలో ‘స‌ర్కారు వారి పాట’ షూటింగ్ ప్రారంభించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu