HomeTelugu Trendingరష్మికతో మహేష్‌బాబు రైలు ప్రేమకథ ప్రారంభం.!

రష్మికతో మహేష్‌బాబు రైలు ప్రేమకథ ప్రారంభం.!

3 2సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’ తర్వాత నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ కశ్మీర్‌లో జరిగింది. కాగా రెండో షెడ్యూల్‌ ప్రారంభమైందని నిర్మాతలు తెలిపారు. ఈ షెడ్యూల్‌లో రైలు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని, ఇది చాలా వినోదాత్మకంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోపక్క రైలులోనే హీరోయిన్‌ రష్మికతో మహేష్‌ ప్రేమ మొదలౌతుందని సమాచారం. ఆయన కశ్మీర్‌ నుంచి కర్నూలులో ఉన్న తన ఇంటికి ప్రయాణిస్తుండగా రష్మిక, ఆమె కుటుంబంతో పరిచయం ఏర్పడుతుందని చెబుతున్నారు. ‘లాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌.. రైలులో సంక్రాంతికి మిమ్మల్ని చేరుకోవడానికి వేగంగా వస్తోంది. అనిల్‌ రావిపూడితో కలిసి సూపర్‌స్టార్‌ తెరపై సందడి చేయబోతున్నారు. సిద్ధంగా ఉండండి’ అని నిర్మాత అనిల్‌ సుంకర పేర్కొన్నారు.

ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణగా కనిపించనున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!