నాగచైతన్య, సమంత ‘మజిలీ’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

‘మజిలీ’ సినిమాతో యంగ్‌ హీరో నాగచైతన్య తన సినీ కెరీర్‌లోనే అరుదైన మైలురాయి చేరుకున్నారు. ఆయన కెరీర్‌లో రూ.50 కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా ఇది నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా (గ్రాస్‌) వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. దర్శకుడు శివ నిర్వాణ ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. సినిమా మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ విజయాన్ని పురస్కరించుకుంటూ నిర్మాతలు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా వేడుకను ఏర్పాటు చేయబోతున్నారట. ‘మజిలీ’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో రూ.22 కోట్లు సాధించినట్లు తెలిసింది.

పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య జంటగా నటించిన చిత్రమిది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందించారు. తమన్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. దివ్యాన్ష కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటించారు. రావు రమేశ్‌, పోసాని, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతోపాటు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది.

CLICK HERE!! For the aha Latest Updates