
February releases Telugu:
టాలీవుడ్‌లో పలు యంగ్ హీరోలు నటించిన February releases విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే నాగ చైతన్య – చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కిన Thandel మాత్రమే బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. ఇక మిగతా సినిమాలు మాత్రం ఇంకా సరైన క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నాయి.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన Laila సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ ఈ సినిమాకు సరైన బజ్ లేకపోవడంతో, కమర్షియల్‌గా నిలదొక్కుకోగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ అబ్బవరం నటించిన Dil Ruba కూడా అదే రోజున రావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు మరీ దారుణమైన పరిస్థితి ఉంది. అసలు ప్రమోషన్ లేకుండా, రిలీజ్ అనౌన్స్ చేయడం మేకర్స్‌కి పెద్ద రిస్క్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను మహాశివరాత్రి వీకెండ్‌కు మార్చే ఆలోచనలో ఉన్నారు.
సుందీప్ కిషన్ హీరోగా నటించిన Mazaka చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26న విడుదల చేస్తే లాంగ్ వీకెండ్‌లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టొచ్చని భావిస్తున్నారు. దిల్ రుబా కూడా అదే డేట్‌కి షిఫ్ట్ అయితే, ఈ రెండు సినిమాలు క్లాష్ అయ్యే అవకాశం ఉంది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన Bhairavam సినిమా కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు సరైన డీల్స్ క్లోజ్ కాకపోవడం, టీజర్ అనుకున్నంత హైప్ క్రియేట్ చేయకపోవడంతో, ఈ సినిమాను మరో డేట్‌కి మారుస్తున్నారు.
ALSO READ: SSMB29 షూటింగ్ నుండి Priyanka Chopra ఎందుకు బ్రేక్ తీసుకుందో తెలుసా