‘మహానటి’ కోసం మొదట నన్నే అడిగారు

సహాజనటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. సినీ నటి అమలా పాల్ ఈ చిత్రంలో ముందుగా తనకు అవకాశం వచ్చిందని అన్నారు‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఆమె’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మహానటి’ చిత్రంలో ముందు నాకు అవకాశం వచ్చింది. కానీ నేను అప్పటికే నా వ్యక్తిగత విషయాలతో సతమతమవుతున్నాను. దాంతో సినిమా చేయలేకపోయాను. కానీ ‘మహానటి’ కోసం చిత్రబృందం ముందు నన్నే సంప్రదించిందన్న విషయం వాస్తవమే’ అని వెల్లడించారు.

అమల ఒప్పుకోకపోవడం వల్ల చిత్రబృందం కీర్తి సురేశ్‌ను ఎంపికచేసుకుంది. మరోపక్క అమల నటించిన ‘ఆమె’ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. రత్నకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.