HomeTelugu Trendingచిత్తూరు యాసతో రవితేజ!

చిత్తూరు యాసతో రవితేజ!

Mass Raja with Chittoor sla

టాలీవుడ్‌ హీరో మాస్‌మహ రాజ రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తరువాత మరో సినిమా చేయనున్నాడు. శరత్ మండవ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఈ సారి చిత్తూరు యాసలో సందడి చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి.

శరత్ మండవ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉందట. పాతికేళ్ల క్రితం జరిగే కథ ఇది. అప్పటి పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రవితేజ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతాడనే విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ డైలాగ్ డెలివరీతో ఆయన ఎలా చెలరేగిపోతాడో చూడాలి. వినోదభరితమైన ఈ సినిమాలో ‘దివ్యాన్ష కౌశిక్’ హీరోయిన్‌గా నటిస్తుంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu