Thalapathy69 Heroine:
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం GOAT గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కి సిద్ధం అవుతోంది.
ఈ సినిమా తరువాత విజయ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. విజయ్ కెరియర్ లో 69వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమా కాబోతోంది. ఈ సినిమా తర్వాత రాజకీయాలతో బిజీగా ఉంటాను అని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే విజయ్ ఈ సినిమా లుక్ టెస్ట్ మొదలుపెట్టారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా లో స్టార్ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం ఒక మలయాళం బ్యూటీ హీరోయిన్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ హీరోయిన్ మరెవరో కాదు మమిత బైజు. ఈ మధ్యనే మలయాళం లో విడుదలైన ప్రేమలు సినిమాతో అన్ని భాషల్లో నువ్వు మంచి పాపులారిటీ సంపాదించింది మమిత. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈమెకు ఆ తర్వాత బోలెడన్ని ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మమత ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుందా.. లేక కీలక పాత్ర పోషిస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. GOAT సినిమా విడుదల తర్వాత విజయ్ ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ సినిమా నటీనటుల గురించి కూడా క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు.