Vijay remuneration for Thalapathy69:
తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమాలకి గుడ్ బై ప్రకటించేసారు. ఇకపై కేవలం రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా దూరమయ్యేలోపు.. ఇన్ని సంవత్సరాలు తనను ఎంతగానో ఆదరిస్తూ ప్రేమించిన ఫ్యాన్స్ కోసం ఒకే ఒక్క ఆఖరి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.
అలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమానే Thalapathy69. విజయ్ హీరోగా నటించబోతున్న ఆఖరి సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మళ్లీ విజయ్ ను వెండి తెర మీద చూడటానికి.. ఈ నేపథ్యంలో ఆఖరి సారిగా విజయ్ ని వెండి తెర మీద చూడటానికి.. ఫాన్స్ కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
అలాంటి క్రేజీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు హెచ్ వినోద్. అయితే ఈ సినిమా కోసం విజయ్ భారీ పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్‌కు 275 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే, విజయ్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వంటి అతిపెద్ద నటులను కూడా ఈ రేసులో వెనక్కి నెట్టినట్లే.
తలపతి విజయ్ ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. అయితే తలపతి 69 సినిమాతో ఆయన రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకోనున్నారన్న విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ ఆఖరి సినిమా కాబట్టి.. ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More: GOAT కి నో చెప్పిన స్టార్ హీరోయిన్.. సినిమా విడుదల అయ్యాక ఏమందో తెలుసా?
తలపతి 69 చిత్రం విజయ్ కెరీర్‌లో ఓ మర్చిపోలేని మైల్ స్టోన్ అవుతుందని.. ఈ సినిమాతో ఆయన చరిత్ర సృష్టిస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.