ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. శకుంతల-దుష్యంతుడి లవ్ స్టోరీని సినిమాగా మలిచేందుకు ఏనాడో సిద్ధమయ్యారు గుణశేఖర్. ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తుండగా.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. దేవ్ మోహన్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా. శకుంతల పాత్రలో సమంత ఫైనల్ అయిన నాటి నుంచి.. దుష్యంతుడి పాత్రకు గుణశేఖర్ ఎవరిని ఎంచుకుంటారోననే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సినిమా షూట్లో జాయిన్ అయ్యాడు దేవ్ మోహన్. మంగళవారం ఆయన సెట్స్ లో అడుగు పెట్టారు. హైదరాబాద్ పరిసరాల్లో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
CLICK HERE!! For the aha Latest Updates