మలైకా ఫిట్‌నెస్ రహస్యం ఇదే..!

మలైకా అరోరా అంటే తెలియని వారు ఉండరేమో.. సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో.. లైఫ్ లో తీసుకునే నిర్ణయాల విషయంలోనూ అదే స్పీడ్ ను మెయింటైన్ చేస్తుంది. వివాదాలు ఎదురైనప్పటికి వాటిని ఎదుర్కొని నిలబడి గెలవడం అలవాటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ తానెంత ఫిట్ గా ఉన్నానో అభిమానులకు చెప్తుంటుంది మలైకా.

ప్రస్తుతం మలైకా వయస్సు 45 సంవత్సరాలు… ఆమె ఫిట్‌నెస్ రహస్యం తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు. 30 సంవత్సరాలలోనే వయసు ఆగిపోయిందా అనే విధంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళినపుడు మలైకా వివిధ రకాల భంగిమల్లో యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ముంబైలో ఓ ఫిట్‌నెస్ సెంటర్ లో స్టీల్ బార్ లపై ఆమె చేసిన ఫీట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మామూలు వ్యక్తులు ఆ ఫీట్ చేయాలంటే చాలా కష్టం. కానీ, మలైకా మాత్రం ఆ ఫీట్ ను అవలీలగా చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.