రాజకీయాలకు అతీతుడను: మంచు మనోజ్‌

నటుడు మోహన్ బాబు విద్యానికేతన్ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్సిమెంట్ కొరకు రోడెక్కి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుమారుడు, హీరో మనోజ్ సైతం విద్యార్థుల తరపున నిరసనలోకి దిగారు. టీడీపీని బకాయిలు చెల్లించామని నిలదీశారు. ఈ ఘటనతో మంచు కుటుంబంపై రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ అభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

దీంతో మంచు మనోజ్ స్పదించారు. మంచి చేయడానికి కులం, మతం చూడనున్న ఆయన ఆరోజు టీడీపీ వ్యక్తిని నిలదీసింది, రోడ్డెక్కి పోరాడింది విద్యార్థుల కోసమే తప్ప రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి కాదని అన్నారు. అలాగే మనోజ్ అంటే రాజకీయాలకు అతీతుడని, ఏ పార్టీ మంచి పనులు చేసినా వారికి మద్దతుగా ఉంటానని, అలాగే ఏ పార్టీ అన్యాయం చేసినా నిలదీస్తానని చెప్పుకొచ్చారు.