HomeTelugu Trending'మా' మహిళా సాధికారత కోసం కమిటీ ఏర్పటు చేసిన మంచు విష్ణు

‘మా’ మహిళా సాధికారత కోసం కమిటీ ఏర్పటు చేసిన మంచు విష్ణు

Manchu vishnu announced wom

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా ముందడుగేశారు. ‘మా’ లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

“విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌’ పేరిట కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహిళా సాధికారత కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. పద్మశ్రీ సునీతా కృష్ణన్‌ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని విష్ణు తెలిపారు. ‘మా’ లో మరింత మంది మహిళలను భాగస్వాములను చేయడానికి ఈ కమిటీ ద్వారా తొలి అడుగు వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!