HomeTelugu Trendingనాగబాబుకు మంచు విష్ణు కౌంటర్

నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్

Manchu Vishnu counter2
మా ఎన్నికలతో టాలీవుడ్‌లో వేడి బాగా పెరిగింది. ‘మా’ ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు ప్యానల్ లోని సభ్యులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్‌ వాళ్లు ఒక్కో సభ్యుడికి రూ.10వేలు ఇస్తోంది అని ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు కౌంటర్‌ ఇచ్చారు.

మా ఎన్నికల్లో ఒక్కో సభ్యుడికి రూ.10 వేలు కాదు, రూ.75 వేలు ఇస్తున్నాము అన్నారు. తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్, అక్క లక్ష్మికి కూడా ఇచ్చానని అన్నారు. స్టార్‌ హీరో మహేశ్‌బాబుకు రూ.75వేలు గూగుల్‌ పే చేశానని, ఆయన ఊళ్లో లేకపోవడంతో చూసుకోలేదని వెటకారంగా అన్నారు. ఓటు వేయని వాళ్లను గుర్తు పెట్టుకుని వాళ్ల దగ్గరి నుంచి రూ.75వేలు వెనక్కి తిరిగి తీసుకుంటానని అదే తన అజెండానని మంచు విష్ణు వ్యంగ్యంగా మాట్లాడారు. గురువారం తన మేనిఫెస్టో విడుదల సందర్భంగా మంచు విష్ణు ఈ వ్యాఖ్యలు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!