HomeTelugu Trending'మంగళవారం' మేకింగ్‌ వీడియో

‘మంగళవారం’ మేకింగ్‌ వీడియో

mangalavaram movie making v

బోల్డ్‌ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్‌భూపతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నవంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా.. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి.

అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రంతో అల్ట్రా డిజాస్టర్‌ సాధించిన అజయ్‌ భూపతి ఈ సారి హార్రర్‌ కమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ‘మంగళవారం’ మేకింగ్‌ వీడియోను చిత్రబృందం సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

‘మేకింగ్ ఆఫ్ మంగళవారం’ అని విడుద‌ల చేసిన‌ ఈ మేకింగ్‌ వీడియో చూస్తుంటే.. అజయ్‌భూపతి ఇదివరకెన్నడూ చేయ‌ని డిఫ‌రెంట్ జోన‌ర్‌ను ట‌చ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. పాయ‌ల్ కూడా త‌న క్యారెక్ట‌ర్‌తో పక్కా ఎంటర్‌టైన్‌ మెంట్ అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మంగళవారంలో ఏముందో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చేయాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!