HomeTelugu Trendingసుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న 'మన్మథుడు' జోడి

సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

Manmadhudu heroine anusha a

టాలీవుడ్‌ హీరో నాగార్జున కెరీర్ లో ‘మన్మథుడు’ ఎంతో స్పెషల్. విజయ భాస్కర్ డైరెక్షన్‌లో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22 ఏళ్లవుతోంది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా న‌టించారు.

టాలీవుడ్‌లో మన్మథుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అన్షు స‌గ్గ‌ర్. ఈ సినిమాలో మహి అనే పాత్రలో అమాయకంగా కనిపిస్తూనే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కనిపించేది కాసేపే అయినా కథ మొత్తం ఈ అమ్మడి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీ తర్వాత అన్షు.. ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ తరవాత పెళ్ళి చేసుకుని కుటుంబంతో లండన్ లో స్థిరపడింది.

ఇటీవల ఇండియాకు వచ్చిన అన్షు.. హైదరాబాద్ లోని తన స్నేహితులను మీట్ అవుతోంది. ఈ సందర్భంగా అన్షు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి నాగార్జున, అమల హాజరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఈ పార్టీలో మన్మథుడు జంట నాగార్జున, అన్షు మీట్ అయ్యారు. తాము కలిసి నటించిన మెమొరీస్ షేర్ చేసుకున్నారు.

నాగార్జునని కలవడం గురించి స్వయంగా హీరోయిన్ అన్షునే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ‘ఔదర్యం, మంచిగా ఉండటం అనేవి నాగ్ సర్‌లో మరింతగా పెరిగాయి. ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి’ అని అన్షు రాసుకొచ్చింది. ఇప్పుడు ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి.నాగార్జున, అన్షు మీట్ అయిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభి, మహి బెస్ట్ పెయిర్ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!