హీరో జీవాపై “మీటూ” ఆరోపణలు.. అసలు నిజం చెప్పిన హీరోయిన్‌!

తన పేరిట తప్పుడు సోషల్‌మీడియా ఖాతాలు సృష్టించి వార్తలు సృష్టిస్తున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నటి నిక్కీ గల్రానీ. నిక్కీ పేరిట ఓ వ్యక్తి ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అంతటితో ఆగకుండా ప్రముఖ తమిళ నటుడు జీవాపై నిక్కీ లైంగిక ఆరోపణలు చేసినట్లుగా ఓ పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్ట్‌లో..’నాకు ‘గొరిల్లా’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ అందులో నాది చెల్లెలి పాత్ర కావడంతో నేను సినిమాకు ఒప్పుకోలేదు. గతంలో నేను జీవాపై ‘మీటూ’ ఆరోపణలు చేసినందుకు ఇప్పుడు నాకు సినిమా అవకాశాలు రావడంలేదు. ఈ విషయం గురించి గతంలోనే జీవాకు అతని భార్య సుప్రియకు క్షమాపణలు చెప్పాను. నేను లైంగిక వేధింపుల గురించి పెట్టిన పోస్ట్‌ను కూడా తొలగించాను. కానీ ఈ విషయాలన్నీ నా కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి. ‘కాలకప్పు3’లో నాకు రావాల్సిన అవకాశం హన్సికకు వచ్చింది. దయచేసి ఈ విషయం గురించి నా అభిమానులు చింతించవద్దని వేడుకుంటున్నాను.’ అని రాసుంది.

అయితే ఈ పోస్ట్‌ తాను పెట్టింది కాదని నిక్కీ గల్రానీ అంటున్నారు. ఈ పోస్ట్‌ స్క్రీన్‌షాట్‌ తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ విషయం చేయి దాటిపోతోంది. కాబట్టి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా పేరుతో ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అర్థంకావడంలేదు. జీవా నాకు మంచి స్నేహితుడు. అతనిపై నేను ఎలాంటి నిందలు వెయ్యలేదు. అతను నాతో తప్పుగా ప్రవర్తించలేదు. అసలు నాకు ‘గొరిల్లా’ చిత్రంలో అవకాశం కూడా రాలేదు. నా పేరుతో ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారో వారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నారు. మీ జీవితాలకు ఉపయోగపడే పనులు చేయండి. ఈసారి ఏదేన్నా ఫేక్‌ ఖాతాను తెరిచే ముందు పేర్లు సరిగ్గా చూసుకోండి. నువ్వు తెరిచిన ఖాతాలో నా పేరు తప్పుగా ఉంది.’ అని పేర్కొన్నారు నిక్కీ.

CLICK HERE!! For the aha Latest Updates