మావయ్య ప్రొడక్షన్ లో చైతు సినిమా!

గత కొంత కాలంగా సురేష్ ప్రొడక్షన్స్ లో నాగచైతన్య హీరోగా ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.
కానీ ఆ విషయంపై ఎలాంటి ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం చైతు ఈ బ్యాంర్ లో ఓ సినిమా
అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘సింగ్ వెర్సెస్ కౌర్’ అనే పంజాబీ చిత్రాన్ని తెలుగులో రీమేక్
చేయడానికి నిర్మాత సురేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంతో కృష్ణ అనే కొత్త డైరెక్టర్ పరిచయం
కానున్నాడు. ఈ కథకు చైతు అయితే యాప్ట్ అని భావించిన సురేష్ బాబు, ఆయనతో
సంప్రదింపులు జరిపారు. చైతు కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ లో పని చేయాలని ఎప్పటినుండో
అనుకుంటున్నాడు. అన్నీ కుదరడంతో ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం చైతు నటించిన రెండు సినిమాలు
విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలానే చైతు, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.
కల్యాణ్ కృష్ణ సినిమాతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ సినిమా కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు.
మొత్తానికి వరుస సినిమాలతో చైతు బిజీ హీరోగా మారిపోయాడు.

CLICK HERE!! For the aha Latest Updates