షూటింగ్ లో పాల్గొంటున్న చిరు!

ఇప్పుడే కదా చిరంజీవి 150 వ సినిమా పూర్తి చేశాడు.. అప్పుడే మళ్ళీ 151కి రెడీ అయిపోతున్నాడు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటుంది సినిమా కోసం కాదు.. టీవీ షో కోసం. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కోసం, ప్రమోషన్స్
కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు.

మీలో ఎవరు కోటీశ్వరుడు 4వ సీజన్ కోసం కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించిన నిర్వాహకులు ఆ తరువాత మెగాస్టార్ సౌకర్యం కోసం బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మళ్ళీ టీవీ షో కోసం ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయ్యారు మెగాస్టార్. మొత్తం ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేసుకొని.. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి నెలలో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.