బాలయ్య కోరికను తీర్చేదెవరు..?

ప్రస్తుతం సినిమాలో హీరోనే విలన్ గా కూడా కనిపించడం ట్రెండ్ గా మారింది. మొదట ఈ ట్రెండ్ ను మొదలు పెట్టింది కమల్ హాసన్. ఆ తరువాత సూర్య, విక్రమ్, శింబు లాంటి స్టార్లు ద్విపాత్రాభినయం చేస్తూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు. ఒకే సినిమాలో తమ అభిమాన నటుడు హీరోగా, విలన్ గా కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమనే చెప్పాలి.  రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించగా, అందులో ఒకటి విలన్ రోల్. 
ఈ సినిమాతో ఎన్టీఆర్ ను వంద కోట్ల క్లబ్ లోకి చేర్చేశారు. విలనిజంలో ఉన్న మత్తుని గ్రహించిన ఇతర హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలకు రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి ఓ ప్రయోగం చేయాలనుకుంటున్నాడు.
నాకు విలన్ పాత్రలో కనిపించాలనుందని నోరు తెరిచి మరీ అడిగారు. మరి ఆయన కోరికను ఎవరు తీరుస్తారో.. చూడాలి!