మెగా ఈవెంట్ ఫ్లాప్ అయింది!

మెగా ఈవెంట్ ఫ్లాప్ అయింది!
ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు పురస్కరించుకొని హైదరాబాద్ శిల్పా కళా వేదికలో వేడుకలను 
నిర్వహించారు. ఈ ప్రోగ్రాం చాలా హైలైట్ అవుతుందనుకుంటే చప్పగా సాగింది. రెగ్యులర్ ఆడియో 
విడుదల కార్యక్రమాల మాదిరి పాటలు, డాన్సులతో స్టేజీ హోరెత్తించేశారు. మెగా హీరోలందరూ ఈ 
కార్యక్రమానికి వస్తారనుకుంటే పవన్ కల్యాణ్ మిస్ అయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కోసం 
ఏర్పాటు చేసిన ఫంక్షన్ కు ఆయన రాకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. పోనీ చిరంజీవి 
బిజీగా ఉన్నాడా..? అంటే అది కాదు. సెవెన్ స్టార్ హోటల్ లో తన స్నేహితులందరికీ స్పెషల్ పార్టీ 
ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్ కు హాజరయ్యాడు. ఇక ఇది మా ఫంక్షన్ కాదన్నట్లు ఒకరి తరువాత ఒకరు మైక్ పట్టుకొని మొహమాటానికి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇక అల్లు శిరీష్ తన మాటలతో కాస్త అతి చేశాడనే చెప్పాలి. రజినీకాంత్, కమల్ హాసన్ కలిస్తే చిరంజీవి అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. అసలు అల్లు శిరీష్ అలా ఎందుకు పోల్చాడో తెలియదు కానీ అందరూ పెద్ద జోక్ అని నవ్వుకుంటున్నారు. ప్రోగ్రాం మొదలైన కొద్ది సేపటికే సీట్లు అన్ని ఖాళీ అయిపోయాయి. దీన్ని బట్టి ప్రోగ్రాం అభిమానులను ఎంత నిరాశ పరిచిందో.. ఊహించుకోవచ్చు!
CLICK HERE!! For the aha Latest Updates