HomeTelugu Trendingటీఎన్‌ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి సాయం

టీఎన్‌ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి సాయం

Mega Star help to TNR famil

ప్రముఖ జర్నలిస్టు, యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల సాయం అందజేశారు. టీఎన్ఆర్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలను ఫోన్లో పరామర్శించారు. దాంతోపాటు తక్షణ ఖర్చుల కోసం లక్షరూపాయల సాయం అందజేశారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన
టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. టీఎన్‌ఆర్ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!