HomeTelugu Newsఎడిట‌ర్ గౌత‌మ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం

ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం

Megastar help to Gautham Ra
గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్రముఖ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు హైద‌రాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కనిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తోపాటు ప‌లువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించారు.

గౌత‌మ్ రాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌత‌మ్ రాజుతో చిర‌కాల అనుబంధం ఉన్న చిరంజీవి త‌క్ష‌ణ సాయంగా ఆయ‌న కుటుంబానికి రూ.2 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గౌత‌మ్ రాజు కుటుంబానికి చిరంజీవి త‌ర‌పున త‌మ్మారెడ్డి భ‌రద్వాజ రూ.2 ల‌క్ష‌లు అంద‌జేశారు. గౌత‌మ్ రాజు కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని చిరంజీవి భ‌రోసానిచ్చారు. ఈ రోజు సాయంత్రం గౌత‌మ్ రాజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!