మెగాస్టార్, లారెన్స్ కలయికలో డాన్స్ ట్రీట్!

చిరంజీవి తాజా చిత్రంగా ‘ఖైదీ నెంబర్ 150’ తెరకెక్కుతోంది. ఇప్పటివరకూ యాక్షన్ .. కామెడీ సన్నివేశాలను తెరకెక్కిస్తూ వచ్చిన ఈ సినిమా టీమ్, నిన్నటి నుంచి పాటల చిత్రీకరణను మొదలుపెట్టేసింది. హైద‌రాబాద్, అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరంజీవి, ల‌క్ష్మీరాయ్‌పై రాఘ‌వ లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో భారీ సెట్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌కు దేవీశ్రీ లిరిక్ అందించ‌డ‌మే కాకుండా అదిరిపోయే ట్యూన్ క‌ట్టారు. మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొక‌టిగా నిలుస్తుంద‌ని యూనిట్ చెబుతోంది. మెగాస్టార్ – లారెన్స్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు కొన్ని పాట‌లు విధిగా గుర్తుకొస్తాయి. ‘హిట్ల‌ర్‌’ మూవీలో ”అబీబీ అబీబీ..” అంటూ చిరు వేసిన స్టెప్పులు క‌నుల ముందు క‌దులాడ‌తాయి. ”ఇంద్ర‌”లో  ”దాయి దాయిదామ‌..” సాంగ్‌లో వీణ స్టెప్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌. మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత లారెన్స్..  మెగాస్టార్‌కి స్టెప్పులు అందిస్తున్నారు. 150వ సినిమాతో మ‌ళ్లీ ఈ క‌ల‌యిక‌లో మ‌రో మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్సెస్‌ని  తెలుగు ప్రేక్ష‌కులు వీక్షించే ఛాన్సుంద‌ని చెబుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates