నాని ‘ఎంసిఎ’ మొదలైంది!

నేచుర‌ల్ స్టార్ నాని, నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ‘ఎంసిఎ’ లాంచ‌నంగా శనివారం ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి వంశీ పైడిప‌ల్లి క్లాప్ కొట్ట‌గా, అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…
దిల్‌రాజు మాట్లాడుతూ.. ”మా బ్యాన‌ర్‌లో నాని హీరోగా ఈ ఏడాది ‘నేను లోక‌ల్‌’ సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌డూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి పున‌రావృత్తం అవుతుంది. అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోనఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు. సినిమా ప్రారంభ‌మైన రోజు నుండే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాం. ఈ షెడ్యూల్‌ను నాని, ఆమ‌ని, రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రుల‌పై కొన్నికీల‌క‌ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌తో స్టార్ట్ చేశాం. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ వాల్యూను పెంచే చిత్ర‌మ‌వుతుంది భావిస్తున్నాను” అన్నారు.